విద్యార్థులకు బహుమతిగా పందులు.. అలా ఎందుకంటే?

by సూర్య | Sun, Jan 16, 2022, 09:22 AM

ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు పాఠశాల్లో పుస్తకాలు, వారి చదువుకు ఉపయోగపడే ఇతర వస్తువులు బహుమతులుగా ఇస్తారు. కాని చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌ ఇలియాంగ్‌ ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పందులను బహుమతిగా ఇవ్వడం వైరల్ గా మారింది. చదువులో ప్రతిభ చూపిన 20 మంది విద్యార్థులకు పందుల్ని బహుమతిగా ఇస్తున్న వీడియో స్థానిక మీడియాలో వైరల్ అయింది. ఇదేం వింత అని ఆసక్తిగా చూస్తున్న వారికి పాఠశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. తాము ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వారి చదువుల నిమిత్తం ఈ పందులు ఆర్థికంగా చేయూతనిస్తాయని అందువల్ల వీటిని బహుమతిగా ఇస్తున్నామని తెలిపారు. వీటిని కొంత కాలం తర్వాత అమ్ముకోవడం లేదా పెంచుకోవడ ద్వారా విద్యార్థి కుటుంబానికి ఆర్థికంగా మేలు జరుగుతుందని అంటున్నారు.

Latest News

 
దొడ్డవరప్పాడులో విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం Wed, May 01, 2024, 03:42 PM
పాము కాటుకి గురైన మహిళ.. చికిత్స పొందుతూ మృతి Wed, May 01, 2024, 03:39 PM
మే డే శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం జగన్ Wed, May 01, 2024, 03:32 PM
మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ తేల్చేసింది Wed, May 01, 2024, 03:32 PM
పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు ఖాయం Wed, May 01, 2024, 03:31 PM