ఆకాశంలో 'మిరకిల్' బేబీ జననం!

by సూర్య | Sun, Jan 16, 2022, 09:16 AM

విమానం ఆకాశంలో ఉండగా గర్భిణీ ప్రసవించిన ఘటనలు పలు సందర్భాల్లో చూశాం. తాజాగా దోహా నుంచి ఎంతెబె వెళ్లే ఖతర్ ఎయిర్ వేస్ విమానంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 35 వేల అడుగుల ఎత్తున ఆకాశంలో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆ విమానంలోని ఆందరిలో టెన్షన్ మొదలైంది. అయితే అదృష్టవశాత్తు అదే విమానంలో వైద్యురాలు, నర్సు కూడా ప్రయాణిస్తుండటంతో అంతా క్షేమంగా జరిగిపోయింది. 35 వారాల గర్భిణీ అయిన యుగాండా వలస కార్మికురాలు ఆ విమానంలో సౌదీ అరేబియా నుంచి ఇంటికి వెళ్తున్నారు. ప్రయాణంలో ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో విమానంలో ఎవరైనా వైద్యులు ఉన్నారా? అని సిబ్బంది అడగగా అదే విమానంలో డాక్టర్ ఐషా ఖాతిబ్ ప్రయాణిస్తోంది. వెంటనే ఆమె గర్భిణి వద్దకు వెళ్లి సేవలు ప్రారంభించింది. ఆమెకు మరో ఇద్దరు ప్రయాణికులు సాయం చేయగా వారిలో ఒకరు అంకాలజీ నర్సు కాగా మరొకరు పీడియాట్రీషియన్. వీరి సాయంతో ఆ మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు అంతా చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. కాగా కాన్పు చేసిన డాక్టర్ పేరుమీదుగా ఆ పాపకు 'మిరకిల్ ఐషా' అనే పేరు పెట్టారు.

Latest News

 
అమ్మఒడి రూ.15 వేలను రూ.17 వేలకు పెంపుచేస్తాం Sat, Apr 27, 2024, 05:09 PM
నాపై అసత్యప్రచారాలు చేస్తున్నారు Sat, Apr 27, 2024, 05:08 PM
బుగ్గన నామినేషన ఆమోదించిన అధికారులు Sat, Apr 27, 2024, 05:08 PM
మళ్ళీ అదేవిధంగా పెన్షన్ పంపిణీ Sat, Apr 27, 2024, 05:07 PM
మద్య నిషేధం చేస్తానని, ఎందుకు చెయ్యలేదు Sat, Apr 27, 2024, 05:06 PM