జల్లికట్టు లో విషాదం,... యజమానినే బలిగొంది

by సూర్య | Sat, Jan 15, 2022, 08:26 PM

తమిళనాడు ప్రజలు ఇష్టంగా నిర్వహించి క్రీడా జల్లికట్టు. దీని కోసం గతంలో కేంద్రం పైన పోరాటం చేసిన చరిత్ర తమిళనాడు ప్రజలకు ఉంది. తమిళనాడులో పొంగల్ వేడుకల సందర్భంగా జల్లికట్టు పోటీలు నిర్వహించడం ప్రాచీన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. ఈ సాహసోపేతమైన క్రీడలో బలిష్టమైన వృషభాలను లొంగదీయాల్సి ఉంటుంది. అయితే, తిరుచ్చి సమీపంలోని సురియూర్ గ్రామంలో జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని సొంత ఎద్దు చంపేసింది. శ్రీరంగంకు చెందిన మీనాక్షి సుందరం అనే వ్యక్తి తన ఎద్దును సురియూర్ గ్రామానికి తీసుకువచ్చాడు. అయితే, ఆ వృషభానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జల్లికట్టు బరి వద్దకు తీసుకెళుతుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ ఎద్దు ఒక్కసారిగా కొమ్ములు విసరడంతో మీనాక్షి సుందరానికి తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

Latest News

 
విజయవాడ కనకదుర్గ గుడిలో అధికారి రాసలీలలు Sat, May 04, 2024, 12:10 PM
కమలాపురం పరిధిలో ఏపీఎస్పీ బలగాలతో పోలీసుల కవాతు Sat, May 04, 2024, 12:09 PM
ఎమ్మెల్యేగా గెలిస్తే సాగు, తాగునీరు అందిస్తాం Sat, May 04, 2024, 11:44 AM
నేడు హిందూపురంలో పర్యటించనున్న సీఎం జగన్ Sat, May 04, 2024, 10:45 AM
సినిమా స్క్రిప్టు ప్రసంగాలకు జనం నవ్వుకుంటున్నారు Sat, May 04, 2024, 10:45 AM