ఎన్నికల ప్రచారం పై కరోనా ఎఫెక్ట్... ఆ నిషేధాజ్ఞలు పొడిగించిన సీఈసీ

by సూర్య | Sat, Jan 15, 2022, 08:24 PM

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం పై తీవ్ర ప్రభావం చూపనున్నదా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడం తెలిసిందే. అయితే, దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో ఈ నెల 8 నుంచి 15 వరకు ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల సందర్భంగా ప్రకటించింది. తాజాగా ఈ నిషేధాన్ని మరింత పొడిగించింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో మరో వారం పాటు సభలు, రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై నిషేధం అమల్లో ఉంటుందని ఈసీ నేడు వెల్లడించింది. తాజా నిషేధాజ్ఞలు ఈ నెల 22 వరకు వర్తిస్తాయని తెలిపింది. ఇన్ డోర్ సభల్లో 300కి మించి పాల్గొనరాదని స్పష్టం చేసింది. సభలు, సమావేశాల్లో 50 శాతం సీటింగ్ కే అనుమతి ఉంటుందని పేర్కొంది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM