శ్రీవల్లి పాటకు టీమిండియా క్రికెటర్ల డ్యాన్స్

by సూర్య | Sat, Jan 15, 2022, 08:23 PM

ఎక్కడ చూసినా పుష్ప సినిమా గురించి చర్చ సాగుతోంది. అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకి వచ్చి, బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కాగా, ఈ చిత్రంలో అల్లు అర్జున్ పలికే తగ్గేదే లే డైలాగ్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా, ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ డైలాగ్ ను బన్నీ శైలిలో పలికి రక్తికట్టించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే. ముఖ్యంగా శ్రీవల్లి పాటకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. తాజాగా టీమిండియా క్రికెటర్లు శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేశారు. ఈ పాటలో అల్లు అర్జున్ ఓ స్టెప్పు వేస్తూ చెప్పు జారవిడుచుకుంటాడు. ఇప్పుడదే స్టెప్పును టీమిండియా ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను పుష్ప చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది.

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM