అది రష్యా పనియే-సైబర్ దాడిపై ఉక్రెయయిన్ ఆరోపణ

by సూర్య | Sat, Jan 15, 2022, 05:14 PM

తమ దేశంపై సైబర్ దాడికి కారణం రష్యాయేనని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆరోపించింది. ఉక్రెయిన్‌ దేశంలో సైబర్ దాడి జరిగింది. దీంతో ప్రభుత్వ వెబ్‌సైట్‌లు అన్ని పనిచేయకుండా పోయాయి. సైబర్ ఎటాక్ కారణంగా ఇక్కడి విదేశాంగ, విద్యా, కేబినెట్ తదితర శాఖల వెబ్‌సైట్‌లు క్లోజ్ అయ్యాయని అక్కడి అధికారులు వెల్లడించారు. సైబర్ దాడి వల్ల ఇలా జరిగిందని తెలిపారు. దీంతో నిపుణులు ఆయా ఐటీ వ్యవస్థలను పునరుద్ధరించే పనిలో పడ్డారు. అయితే ఈ దాడి ఎవరు చేశారనేది ఇప్పటి వరకూ తెలియలేదు. దీంతో అక్కడి సైబర్ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ దాడికి ముందు ‘ఉక్రెనియన్లు మీ వ్యక్తిగత సమాచారం మొత్తం తొలగించాం’అంటూ ఓ మెసెజ్‌ను హ్యాకర్లు విదేశాంగ వెబ్‌సైట్‌లో పెట్టారు. దానిని తిరిగి పొందడం అసాధ్యమని, భవిష్యత్తుల్లో పరిస్థితులు మరింత దిగజారుతాయని కూడా ఆ మెసెజ్‌లో ఉంది. దీంతో కావాలనే ఎవరో చేశారనే విషయాన్ని అక్కడ ప్రభుత్వం గ్రహించింది. గతంలో కూడా ఇక్కడ ప్రభుత్వ వెబ్‌సైట్‌లపై సైబర్ దాడులు జరిగాయి. అయితే ఇప్పుడు జరిగిన సైబర్ దాడిపై ఉక్రెయిన్ దేశం.. రష్యాను తప్పుబడుతుంది. రష్యాకు చెందినవారే ఈ పని చేశారంటూ ఆరోపించింది. ఉక్రెయిన్ విషయంలో రష్యా.. అమెరికా, నాటో కూటమి దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ తరుణంలో ఈ దాడి చోటుచేసుకుంది. కాగా ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదంటూనే రష్యా.. ఆ దేశ సరిహద్దుల్లో లక్షమంది సైనికులు, ఆయుధాలను మోహరించింది. ఈ విషయమై ఇటీవల అమెరికా, రష్యాల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఈ సైబర్ దాడి జరగడంతో ఉక్రెయిన్ ప్రభుత్వం రష్యానే అనుమానిస్తోంది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM