టెస్టింగ్ కిట్లతోపాటు మాస్క్ లు..అమెరికా

by సూర్య | Sat, Jan 15, 2022, 05:15 PM

ఇంట్లోనే కోవిడ్ టెస్ట్‌లు చేసుకునేలా వంద కోట్ల ర్యాపిడ్ కిట్లతో పాటు ఎన్ 95 మాస్క్‌లను తమ పౌరులకు ఉచితంగా అందిస్తామని దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఒమిక్రాన్ అమెరికా‌ను వణికిస్తోంది. రోజుకు లక్షలాది సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 8 లక్షల 14 వేల 494 మంది కరోనా బారిన పడ్డారు. రెండు వేలకుపైగా వైరస్‌తో మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ 4 కోట్ల 89 లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. ఐదేళ్లలోపు పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. పిల్లలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ కట్టడికి అక్కడ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండడం లేదు. ఈ క్రమంలో యూఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే కోవిడ్ టెస్ట్‌లు చేసుకునేలా వంద కోట్ల ర్యాపిడ్ కిట్లను ప్రజలకు అందజేయనుంది. వీటితో పాటు ఎన్ 95 మాస్క్‌లను తమ పౌరులకు ఉచితంగా అందిస్తామని దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీంతోపాటు వచ్చే వారం నుంచి వెయ్యి మంది సైనిక వైద్య సిబ్బందిని రంగంలోకి దింపుతుంది. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జో బైడెన్ చెప్పారు. దేశంలో కేసులు భారీగా పెరగడంతో వైద్య సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. దాంతో వారంతా హోమ్ క్వారంటైన్‌కు వెళ్తున్నారు. రోగులను చూసుకునేందుకు ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మిలటరీ వైద్యులను అవసరమైన ప్రాంతాలకు, ఆస్పత్రులకు తరలించనున్నారు. కాగా ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్, అర్జెంటీనా, బ్రెజిల్, జర్మనీల్లోనూ కొత్త కోవిడ్ కేసులు రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి.

Latest News

 
చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్.. ముందుగానే అలర్ట్, ఈసారి ఆ తప్పు జరగకుండా Thu, Apr 25, 2024, 07:45 PM
డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్‌గా రవి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:39 PM
ఉద్యోగిగా కొనసాగే అర్హత లేదు.. ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం Thu, Apr 25, 2024, 07:35 PM
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం Thu, Apr 25, 2024, 07:31 PM
వీళ్లా వైఎస్సార్ వారసులు?.. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు,,,షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్ Thu, Apr 25, 2024, 07:25 PM