విద్యుత్ షాక్...జవాన్ల మరణం

by సూర్య | Sat, Jan 15, 2022, 05:12 PM

విద్యుత్ షాక్ ఘటన బీహార్ రాష్ట్రంలో విషాదం మిగిల్చింది. కరెంట్ షాక్‌తో ముగ్గురు జవాన్లు చనిపోయారు. రాష్ట్రంలోని సుపౌల్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హై వోల్టేజ్ విద్యుత్ తీగలు తగలడంతో స్పాట్‌లో ట్రైనీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సశస్త్ర సీమాబల్ 45 బీ బెటాలియన్‌కు చెందిన జవాన్లు టెంట్లు తీస్తుండగా ఈ ఘోరం జరిగంది. మృతి చెందిన వారిలో మహారాష్ట్రకు చెందిన అతుల్ పాటిల్, పరశురామ్ సంబర్, మహేంద్ర చంద్ర కుమార్ బోప్చే ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న ఇతర జవాన్లు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారందరిని సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఎస్‌బీ పూర్ణియా రేంజ్ డీఐజీ సంజయ్ కుమార్ సారంగి ఘటనా స్థలానికి వెళ్లారు. బీర్పూర్ క్యాంపులో జవాన్లకు పలు అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ ముగిసిన తర్వాత ట్రైనీ జవాన్లు గుడారాలను తీయడానికి ప్రయత్నించారు. అయితే పైన ఉన్న హైవోల్టేజీ వైరు తాకడంతో టెంట్ అంతా కరెంట్ పాకింది. దాంతో టెంట్‌లు తీయడానికి ప్రయత్నించినప్పుడు జవాన్లకు విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడ ముగ్గురు జవాన్లు చనిపోయారు. అయితే శిక్షణా కేంద్రం పైనుంచి వెళ్తున్న హైటెన్షన్‌ వైరును తొలగించాలని జవాన్లు చాలాసార్లు విద్యుత్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు తొలగించలేదు. వైరు తొలగించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM