తిండి కోసం...కిడ్నీలు అమ్మకానికి

by సూర్య | Fri, Jan 14, 2022, 08:25 PM

బతికేందుకు ఆస్తులను అమ్ముకొన్న వారిని చూశాం. కట్టుబట్టలతో నిలిచిన వారిని చూశాం. కానీ ఆకలితీర్చుకొనేందుకు కిడ్నీలు అమ్ముకొనే దుస్థితి ఎక్కడైనా వచ్చింది. అలాంటి ఘటనలు మనం అప్ఘానిస్తాన్ లో చూడాల్సి వస్తోంది. తాలిబన్ల పాలనలో అఫ్గన్ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఉపాధిని కోల్పోయి చేతిలో డబ్బు.. తినేందుకు తిండి కరవయి ఎటుచూసినా ఆకలి కేకలు వినబడుతున్నాయి. ఎవర్ని కదిలించినా, ఎటుచూసినా కన్నీటి వ్యథలే.. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన కథ. పిల్లల కడుపు నింపేందుకు దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు తమ అవయవాలను అమ్ముకునే దుస్థితి అఫ్గన్లకు దాపురించింది. చిన్నారుల భవిష్యత్తు కోసం తమ జీవితాలనే పణంగా పెడుతూ శరీర భాగాలను తెగనమ్ముకుంటున్నారు. ‘‘నేను బయటకు వెళ్లి అడుక్కోలేను.. అందుకే ఆస్పత్రికి వెళ్లి నా కిడ్నీని లక్షా 69 వేలకు అమ్మేశాను.. ఆ డబ్బుతో కనీసం నా పిల్లలకు కొంతకాలమైనా తిండి పెడతాను’’ అని గులాం హజ్రత్‌ అనే వ్యక్తి కన్నీటిపర్యంతమయ్యాడు. అఫ్గన్‌లో చాలామంది తండ్రులు ఇదేతరహా వ్యథలో ఉన్నారు. అమెరికా సైన్యం వైదొలగడంతో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గనిస్థాన్‌ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలు కటిక పేదరికంలోకి జారుకున్నారు. తినడానికి తిండిలేక అవయవాలను అమ్ముకునేందుకు వెనకాడటం లేదు. హెరాత్‌ ప్రావిన్సుల్లో కొన్ని నెలలుగా కిడ్నీ విక్రయాలు పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా చాలా మంది కిడ్నీలు అమ్ముకోడానికి ముందుకొస్తున్నారని స్థానిక వైద్యులు తెలిపారు. కిడ్నీ దాతలు, కొనుగోలుదారు పరస్పర అంగీకారంతోనే ఇలా జరుగుతోందని వివరించారు. వీటికి అఫ్గన్ కరెన్సీలో 600,000 నుంచి 800,000 వరకు చెల్లిస్తున్నారని తెలిపారు. అంతేకాదు, బ్లడ్ గ్రూప్‌ను బట్టి కిడ్నీల ధర ఉంటుందని డాక్టర్ నసీర్ చెప్పారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM