సెకన్లలో సర్వీస్ అందించి...గిన్నిస్ లో ఎక్కింది

by సూర్య | Fri, Jan 14, 2022, 08:26 PM

సెకన్లలో సర్వీసు అందించడంతో ఓ హోటల్ ఏకంగా గిన్నిస్ రికార్డ్ ఎక్కింది. అదెక్కడా అంటారా. ఎందుకు గిన్నిస్ రికార్డు లోకి ఎక్కింది అంటారా...? హోటల్‌కో.. రెస్టారెంట్‌కో వెళ్లి.. ఆర్డర్ ఇచ్చిన చాలా సేపటికి కానీ ఫుడ్ మన టేబుల్‌పైకి రాదు. కానీ ఓ రెస్టారెంట్లో అటువంటి బాధ లేదు. అక్కడకు వెళ్లి ఇలా ఆర్డర్ ఇస్తే.. వెయిటర్స్ అలా తెచ్చేస్తారు. దాంతో ఆ రెస్టారెంట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌‌ను కూడా సాధించింది. మెక్సికోలో గారిబాల్డి రెస్టారెంట్‌లో (Garibaldi Restaurant)కస్టమర్లు ఆర్డర్ చేసిన 13.5సెకన్ల వ్యవధిలోనే ఫుడ్ అందిస్తారు. ఈ ప్రత్యేకత వల్లే కస్టమర్లు అక్కడకు మళ్లీ మళ్లీ వెళ్తుంటారు. ఆ రెస్టారెంట్‌కు కస్టమర్లు క్యూ కడుతున్నారు. కస్టమర్లకు ఎవరు వేగంగా ఫుడ్ సర్వ్ చేస్తారనేదానిపై అక్కడున్న వెయిటర్‌లు సరదాగా పోటీ పడ్డారు. ఇదే సీరియస్‌గా అలవాటై గిన్నీస్ వరల్డ్ రికార్డు సంపాదించి పెట్టింది. దీంతో ఆ రెస్టారెంట్‌కు మరింత పాపులర్ అయింది. 1996, ఆగస్టు 31వ తేదీన 13.5 సెకన్లలో అందించారు. ఇప్పటికీ ఈ రెస్టారెంట్ ఇదే పద్ధతిని కొనసాగిస్తోంది. ఇంత వేగంగా ఫుడ్ సర్వ్ చేయడంతో కస్టమర్లు చాలా సంతోషంగా అక్కడకు వెళ్తున్నారు. మెక్సికన్ వంటలు తయారు చేయానికి గంటల తరబడి సమయం పడుతుందట. అందుకని రెస్టారెంట్‌లో అన్ని పదార్థాలను ముందుగానే సిద్ధం చేసుకుంటారు. వాటిని చక్కగా ప్లేట్‌లో పెట్టేస్తారు. ఎవరైనా వచ్చి ఆర్డర్ చేసిన వెంటనే ఆయా ఆహార పదార్థాలను వెంటనే వారి టేబుల్‌పై తీసుకెళ్లి పెట్టేస్తారు. ఈ పని వేగంగా జరగడానికి వెయిటర్స్ మధ్య కమ్యూనికేషన్ అంతే వేగంగా ఉంటుంది. సంకేతాలతో కమ్యూనికేట్ చేసుకోవడానికి వారికి రెస్టారెంట్ శిక్షణ కూడా ఇస్తుంటుంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM