కొత్తగా రెండు ఔషధాలను డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు

by సూర్య | Fri, Jan 14, 2022, 08:24 PM

ఇప్పటి వరకూ కేవలం మూడు చికిత్సా విధానాలను మాత్రమే డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 2020లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా బాధితులకు కోర్టికొస్టెరాయిడ్‌ను వినియోగించవచ్చని తెలిపింది. కోవిడ్-19కు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా మహమ్మారికి అడ్డుకట్టపడటం లేదు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి హడలెత్తిస్తున్నాయి. వ్యాక్సిన్లతో పాటు పలు ఔషధాలను కరోనా చికిత్సకు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం రెండు కొత్త కోవిడ్ -19 చికిత్సలను ఆమోదించింది. తీవ్రమైన అనారోగ్యం బారినపడకుండా, మరణాలను అరికట్టడానికి టీకాలతో పాటు పలు ఔషధాలకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలుపుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ఆస్పత్రిల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుండటం.. మార్చి నాటికి ఐరోపాలోని సగం మంది వైరస్ బారినపడతారని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా రెండు ఔషధాలను డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసినట్టు బ్రిటిష్ మెడికల్ జర్నల్ బీఎంజీ పేర్కొంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న లేదా పరిస్థితి విషమంగా ఉన్న కోవిడ్ రోగులకు ఆర్థరైటీస్‌ ఔషధం బారిసిటినిబ్‌ను కార్టికోస్టెరాయిడ్స్‌తో కలిపి వినియోగించవచ్చని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు పేర్కొన్నారు. దీని వల్ల మరణాలు రేటుతో పాటు వెంటిలేటర్ అవసరం తగ్గుతుందని తెలిపారు. అలాగే, వృద్ధులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు లేదా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉన్న నాన్-సీరియస్ కోవిడ్ రోగులకు సింథటిక్ యాంటీబాడీ చికిత్స సోత్రోవిమాబ్‌ను సిఫార్సు చేసింది. ఆసుపత్రిలో చేరే ముప్పులేని వ్యక్తులకు Sotrovimab వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొంది. అయితే, ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్‌ల దాని ప్రభావం ‘ఇప్పటికీ అనిశ్చితిగా ఉంది’ అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కార్టికొస్టెరాయిడ్స్ ధర తక్కువ, విస్తృతంగా అందుబాటులో ఉంటాయి.. సాధారణంగా వైరస్ తీవ్రత వల్ల కలిగే అనారోగ్యంతో పోరాడుతాయి. ఇక, గతేడాది జులైలో ఆమోదించిన ఆర్థరైటిస్ ఔషధం టోసిలిజుమాబ్, సరిలుమాబ్, IL-6 నిరోధకాలు. ఇవి SARS-CoV-2 వైరస్‌ తీవ్రతను తగ్గిస్తాయి. జానస్ కినేస్ నిరోధకాలుగా పేర్కొనే బారిసిటినిబ్ ఔషధాలు విభిన్న తరగతికి చెందినవి. వీటిని కూడా IL-6 నిరోధకంగానే పరిగణిస్తారు. రెండూ అందుబాటులో ఉన్నప్పుడు.. వైద్యుల అనుభవం సహా ధర ఆధారంగా ఒకదాన్ని ఎంచుకోండి అని మార్గదర్శకాల్లో పేర్కొంది. సింథటిక్ యాంటీబాడీ చికిత్స రెగెనెరాన్‌ను సెప్టెంబరులో డబ్ల్యూహెచ్ఓ ఆమోదించింది. అదే విధంగా సోట్రోవిమాబ్‌ను ఉపయోగించవచ్చని మార్గదర్శకాలు చెబుతున్నాయి.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM