టీకాలపై నో వర్రీ...ఇక అందరికీ ఒకే టీకా

by సూర్య | Fri, Jan 14, 2022, 08:20 PM

ఆ టీకా ఎవరికీ, ఈ టీకా ఎవరికి అన్న ఆందోళన ఇక వద్దు. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అందరికీ ఒకే కరోనా టీకా వేసేయవచ్చు. భార‌త్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 టీకా కొవాగ్జిన్ మ‌రో ఘ‌న‌త సాధించింది. యూనివ‌ర్సల్ వ్యాక్సిన్‌గా కొవాగ్జిన్ టీకాకు గుర్తింపు లభించింది. ఈ విష‌యాన్ని భార‌త్ బ‌యోటెక్ ప్రతినిధులు అధికారింగా ప్రక‌టించారు. ప్రస్తుతం కొవాగ్జిన్ టీకాను వయోజనులతోపాటు.. చిన్నారులకు సైతం అందజేస్తున్నారు. మొదట 18 ఏళ్లు పై బ‌డిన వారికి మాత్రమే ఈ టీకాలు వేయగా.. జనవరి మూడో తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వారికి సైతం కొవాగ్జిన్ టీకాను వేస్తున్నారు. అలాగే వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసుగానూ కొవాగ్జిన్ టీకాను పంపిణీ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ టీకాకు అత్యవసర ఉపయోగానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. దీంతో ఇటీవ‌ల భార‌త్ బ‌యోటెక్ త‌మ కొవాగ్జిన్ వ్యాక్సిన్‌కు పూర్తిస్థాయి అనుమ‌తులు ఇవ్వాల‌ని డ్రగ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల్లోనే కొవాగ్జిన్ కు యూనివ‌ర్సల్ వ్యాక్సిన్‌గా గుర్తింపు దక్కింది. మన దేశంలో వేసిన టీకాల్లో 12 శాతం వాటా కొవాగ్జిన్‌దే. గత ఏడాది జనవరి 3న అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగానికి కొవాగ్జిన్‌కు అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్‌ను సమర్థవంతంగా అడ్డుకుంది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌.. మనదేశంలో అభివృద్ధి చేసిన తొలి కరోనా టీకాగా గుర్తింపు పొందింది. ఇదిదిలావుంటే ఒమిక్రాన్ వ్యాప్తి భయంతో బూస్టర్ డోస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ బూస్టర్ డోసు.. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్‌లను సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు అధ్యయనంలో వెల్లడయ్యిందని భారత్ బయోటెక్ తెలిపింది. లైవ్ వైరస్ న్యూట్రలైజేషన్ పరీక్ష ఆధారంగా కీలక విషయాలను వెల్లడించింది. 100 శాతం సీరం శాంపిల్స్‌లో డెల్టా వేరియంట్‌ పూర్తిగా నాశనం అయ్యిందని, 90 శాతం సీరమ్‌లో ఒమిక్రాన్ వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొందని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎమోరీ యూనివర్సిటీలో చేపట్టిన ఈ అధ్యయనంలో భాగంగా కొవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకున్న ఓ వ్యక్తి దగ్గర నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షించినట్టు పేర్కొంది. ఇందులో బూస్టర్ డోసు.. ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా వేరియంట్‌ను సంహరిస్తున్నట్టు తేలిందని వివరించింది. కాబట్టి, రోగ నిరోధక శక్తి అధిక స్థాయిలో ఉంచుకోవడానికి బూస్టర్ డోసు అవసరమేనని పేర్కొంది.

Latest News

 
పిఠాపురం: నామినేషన్ వెనక్కి తీసుకోనున్న వంగా గీత..? వైసీపీ గూటికి వర్మ Sun, Apr 28, 2024, 08:03 PM
వైఎస్ జగన్ కాన్వాయి కిందపడిన కుక్క.. పోలీసులకు సీఎం సెక్యూరిటీ కీలక ఆదేశాలు Sun, Apr 28, 2024, 07:59 PM
విశాఖ పోర్టులో "ది వరల్డ్".. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రెసిడెన్షియల్ నౌక విశేషాలు తెలుసా Sun, Apr 28, 2024, 07:56 PM
బాలయ్య ‘మందు అలవాటు’ గురించి చిన్నల్లుడు భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు Sun, Apr 28, 2024, 07:43 PM
ఏపీలో టీడీపీ కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారా.. చంద్రబాబు స్టాండ్ ఏంటి Sun, Apr 28, 2024, 07:37 PM