బొద్దింకే కాద అని...అజాగ్రత్తలొద్దు

by సూర్య | Fri, Jan 14, 2022, 08:21 PM

బొద్దింకే కదా అని తేలికగా తీసుకొంటే వాటితో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యూజిలాండ్‌లో ఆక్లాండ్‌కు చెందిన జేన్ వెడ్డింగ్‌ చెవిలో బొద్దింక దూరడంతో నానా అవస్థలు పడ్డాడు. వెడ్డింగ్‌ స్విమ్మింగ్‌కు వెళ్లి వచ్చిన దగ్గర నుంచి తన ఎడమ చెవిలో సమస్య మొదలైంది. చెవిలోకి నీరు వెళ్లిపోయిందనుకుని అదే సర్దుకుంటుందని ఊరుకున్నాడు. అయితే కొంత సమయానికి చెవి పూర్తిగా మూసుకుపోయింది. శబ్దాలు వినిపించలేదు. పైగా నొప్పి మొదలైంది. దాంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. అయితే ఆ డాక్టర్ మందులు ఇచ్చేసి పంపించేశారు. మందులు వాడినా చెవిలో బాధ తీరలేదు. బాధ భరించలేక జేన్ వెడ్డింగ్ ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్‌ను సంప్రదించాడు. ఆయన చెక్ చేసి చెవిలో ఏదో పురుగు ఉన్నట్టుందని వెడ్డింగ్‌కు చెప్పారు. కొన్ని పరికరాలను ఉపయోగించి దానిని బయటకు తీశారు. చెవి నుంచి దానిని తీయగా అది బొద్దింకని తెలిసింది. దాంతో జేన్ వెడ్డింగ్ ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. మునుపెన్నడూ చనిపోయిన బొద్దింకను ఎవరి చెవిలోంచి బయటకు తీయలేదని ఆ డాక్టర్ వెడ్డింగ్‌కు చెప్పారు. కాగా మూడు రోజులు తన చెవిలో బొద్దింక ఉందని జేన్ వెడ్డింగ్ భయపడిపోయాడు.

Latest News

 
ఓటు వేసేందుకు వస్తూండగా మృతి Sun, May 12, 2024, 10:12 PM
నగదు స్వాధీనం.. ఇద్దరు వైసీపీ నేతలు అరెస్ట్ Sun, May 12, 2024, 10:10 PM
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం Sun, May 12, 2024, 10:09 PM
దివ్యాంగులకు అందుబాటులో 1,741 వీల్ చైర్లు Sun, May 12, 2024, 10:07 PM
పంపిణీ కేంద్రాల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్ Sun, May 12, 2024, 10:06 PM