టెన్నిస్ దిగ్గజం జకోవిచ్‌కు భారీషాక్‌.
 

by Suryaa Desk |

టెన్నిస్‌ దిగ్గజం, ప్రపంచ నంబర్‌-1 ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌కు ఆస్ట్రేలియాలో భారీ షాక్‌ తగిలింది. తాజాగా మరోసారి అతడి వీసాను రద్దు చేసింది. ఈ మేరకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ మినిస్టర్‌ అలెక్స్‌ హాకే నిర్ణయం తీసుకున్నారు. జకోవిచ్‌ ఈనెల 5న మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. అయితే, అతడి వద్ద వాక్సినేషన్‌కు సంబంధించిన సరైన సర్టిఫికేట్స్ లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు అతడిని అడ్డుకున్నారు. 


కేప్ టౌన్ టెస్టులో అంపైర్ల తీరుపై టీమిండియా తీవ్ర ఆగ్రహం.. ఈ క్రమంలోనే జకోవిచ్‌ వీసాను రద్దు చేసి అతడిని ఇమ్మిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించారు. అతడి వీసాను వెంటనే పునరుద్ధరించాలని, అతడిని డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి విడుదల చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో జకోవిచ్‌ డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. ఇక జనవరి 17 నుంచి మెగా ఈవెంట్‌ ప్రారంభమవుతున్న తరుణంలో ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి తన సర్వహక్కులను ఉపయోగించి మరోసారి వీసా రద్దు చేశారు.


 


 

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM