చావడానికి అనుమతి కోరితే ఉద్యోగం ఇచ్చారు!

by సూర్య | Fri, Jan 14, 2022, 01:51 PM

ఉపాధి లేక పూట గడవడానికి ఇబ్బందిగా మారిందని తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన మహిళకు కేరళ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. అనీరా కబీర్ అనే ట్రాన్స్ విమెన్ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ తో పాటుగా ఎంఈడీ పూర్తి చేసి ఆ రాష్ట్ర అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమెకు తొలుత ఓ ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయుడిగా ఉద్యోగం లభించింది. అయితే ట్రాన్స్ విమెన్ అని తెలియడంతో ఆమెపై వివక్ష, హేళన చేయడంతో భరించలేక చేరిన రెండు నెలలకే ఉద్యోగాన్ని వదిలేసింది. తిరిగి ఎంత ప్రయత్నించిన మరో ఉపాధి మార్గం లభించలేదు. పూట గడవడం ఇబ్బందిగా మారడంతో తనకు కారుణ్య మరణం కోసం హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయం రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి చేరడంతో అనీరాకు విద్యాశాఖలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో పర్మినెంట్ చేస్తామని చెప్పారు.

Latest News

 
పార్టీ ముఖ్య నేతలతో లోకేష్ సమీక్ష Sun, Sep 24, 2023, 03:02 PM
రైళ్లపై రాళ్లు రువ్వడం నేరం Sun, Sep 24, 2023, 02:07 PM
కెనడాలో భారతీయ విద్యార్థులు.. పేరెంట్స్ ఆందోళన Sun, Sep 24, 2023, 01:48 PM
తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ Sun, Sep 24, 2023, 12:27 PM
అంబేద్కర్ విగ్రహానికి ఏపీఎస్టీఎఫ్ వినతి Sun, Sep 24, 2023, 12:16 PM