అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే చర్యలు

by సూర్య | Fri, Jan 14, 2022, 01:49 PM

విశాఖపట్నం: సంక్రాంతి పండగ సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా పాల్గొన్నా మూడు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుందని నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన నర్సీపట్నంలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ప్రజలు సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోడిపందాలు పేకాట నియంత్రణకు మండల స్థాయిలో అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే గట్టి నిఘాను కూడా ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM