గుంటూరు జిల్లాలో గంజాయి బ్యాచ్ హల్ చల్
 

by Suryaa Desk |

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి ఉండవల్లి లో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేస్తున్నారు. రోజు రోజుకు తాడేపల్లిలో వీరి ఆగడాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఉండవల్లి లో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో దారి దోపిడీకి ప్రయత్నించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అంజి అనే వ్యక్తి విజయవాడ పటమాట రైతు బజార్ లో విధులు ముగించుకుని ఇంటికి తిరుగుప్రయాణం అయ్యాడు. ఈ మేరకు ఉండవల్లిలో ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈమని ఫణి కుమార్, అనంత సందీప్, పలగాని చంద్రమౌళి లు అంజీ కారును అడ్డుకున్నారు. అంజి మీద దాడి చేసి కారులోని డబ్బులు చోరీ చేసేందుకు యత్నించారు. కారు అద్దాలు ధ్వంసం చేసి అతని మీద దాడి చేసి గాయపరిచారు. స్థానికులు రావడంతో పరారయ్యారు. దీంతో అంజి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM