తాడేపల్లిలో పందెం రాయుళ్ళ అరెస్ట్
 

by Suryaa Desk |

గుంటూరు జిల్లా తాడేపల్లి లో కోడి పందాలా స్థావరాలపై మంగళగిరి ఎస్ఈబీ సిఐ మారయ్యబాబు, సిబ్బందితో కలిసి శుక్రవారం మొరుపుదాడులను నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కోడిపందాలు నిర్వహిస్తున్న సందర్బంగా ఈ దాడులు నిర్వహించినట్లు సిఐ మారయ్యబాబు తెలిపారు. తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి అటవీ ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.


ఈ దాడుల్లో ఉండవల్లి కొండ ప్రాంతంలో 9 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 6650 నగదు, 4 పందెంకోళ్లు, 22 కోడి కత్తులు, 9 మొబైల్ ఫోన్ లు, 2 బైకు లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ దాడులలో ఎస్ఈబీ ఎస్సైలు మల్లికార్జున రావు, ఎండీ షరీఫ్, శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్స్ శ్రీనివాసరావు, పి రమేష్, హనుమంతరావు, ఎం నాగరాజు, పి నారాయణ, వీరాంజనేయులు, ఎస్ వీ వీ ప్రసాద్, ఎల్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM