పునాది లేకుండానే ఇంటి నిర్మాణం.. బోలెడంత ఆదా!

by సూర్య | Fri, Jan 14, 2022, 12:23 PM

పునాది పటిష్టంగా ఉంటే ఇల్లు దృఢంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ కర్ణాటకలోని మైసూర్ కు చెందిన ఓ ఆర్కిటెక్ట్ మాత్రం పునాది లేకుండానే ఇంటి నిర్మాణం చేపడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే రెండు ఇళ్లను నిర్మించి తన ప్రతిభ ఏంటో చూపిస్తున్నాడు. శరత్‌ కుమార్‌ అనే ఆర్కిటెక్ట్ రెండేళ్ల పాటు ఓ విదేశీ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పని చేశాడు. ఈ క్రమంలో పునాది లేకుండా ఇల్లు నిర్మించే టెక్నాలజీపై పట్టు సాధించాడు. మూడు సరికొత్త పద్ధతులను అవలంభిస్తూ కర్ణాటకలో పునాది లేని ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టాడు. ఈ విధానంలో 30-40 శాతం ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నాడు. ఈ పద్దతిలో నిర్మించే ఇంటికి ట్రాక్టర్‌ ద్వారా 7 అడుగుల లోతు వరకు రంధ్రం చేసి పిల్లర్‌ను ఏర్పాటు చేస్తారు. రెండోది ప్లింత్‌ బీమ్‌ ఏర్పాటు చేసి. మూడోది స్లాబ్‌ ఆన్‌ గ్రేడ్‌ పద్ధది ద్వారా ఇంటి నిర్మాణం పూర్తి చేస్తారు. ఈ పద్దతిలో కేవలం 3 నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని, నిర్మాణానికి కాంక్రీట్‌ ఉపయోగించటం వల్ల ఇల్లు 75-100 ఏళ్ల పాటు మన్నికగా ఉంటుంది చెబుతున్నాడు శరత్. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM