by సూర్య | Fri, Jan 14, 2022, 12:21 PM
ఏపీ ఉద్యోగుల హెచ్ఆర్సీ అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం రాజీపడబోమని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. తాజాగా ఉద్యోగ సంఘాల నేతలు సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు గంటన్నర పాటు సమావేశమై చర్చించారు. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన హెచ్‌ఆర్‌ఏ స్లాబులను కేంద్ర ప్రభుత్వ స్లాబులతో పోల్చడం వల్ల ఉద్యోగులు నష్టపోతారని నేతలు చెప్పారు. సంక్రాంతి తర్వాత సీఎం జగన్ చర్చించి నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
Latest News