కరోనా వేళ అలర్ట్..జాగ్రత్తలివే

by సూర్య | Fri, Jan 14, 2022, 12:20 PM

భారత్ లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక్క రోజే 2,60,000 వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వడం గమనార్హం. రోజూ దేశ వ్యాప్తంగా 300కి పైగా ఈ మహమ్మారికి బలవుతున్నారు. మరో వైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్త వహించినా పెను ప్రమాదం తప్పదని ఇప్పటికే WHO హెచ్చరించింది. కరోనా ఫస్టు వేవ్, సెకండ్ వేవ్ సమయంలో బెడ్లు, ఆక్సిజన్ దొరక్క అనేక మంది మరణించారు. ఈ పరిస్థితి రాకుండా ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి.


మాస్కు, భౌతిక దూరం తప్పనిసరి.


ఎప్పటికప్పుడు పరిసరాలను శానిటైజ్ చేసుకోవాలి.


జ్వరం, దగ్గు, సర్ది, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలి. చికిత్స తీసుకోవాలి.


చల్లని పదార్దాలు, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి.


వేడి వేడి ఆహారం తీసుకోవాలి. మాంసాకృత్తులను అధికంగా తీసుకోవాలి.


జన సమూహాల్లోకి వెళ్లవద్దు. ఎక్కువ మంది గుమి కూడదు.


రోగనిరోధక శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.


గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, బీపీ, షుగర్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.


గర్భిణీ స్త్రీలు, వృద్దులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలి.

Latest News

 
నీకు కూడా కుటుంబం ఉందని గుర్తు పెట్టుకో,,,ఎమ్మెల్యే పుల్లారావుపై రజిని ఆగ్రహం Sat, Feb 08, 2025, 07:50 PM
ఏపీలోని ఆ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసు పెంపు Sat, Feb 08, 2025, 07:36 PM
హెల్మెట్ పై ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రాంబాబు Sat, Feb 08, 2025, 07:25 PM
మల్లిఖార్జునస్వామికి టీడీపీ ఎమ్మెల్యే భారీ విరాళం.. బంగారు వస్తువులు అందజేత Sat, Feb 08, 2025, 07:02 PM
జనసేన నేత కిరణ్ రాయల్‌పై మహిళ సంచలన ఆరోపణలు Sat, Feb 08, 2025, 06:57 PM