సంక్రాంతి పండగ రద్దీ.. ప్రత్యేక రైళ్లు
 

by Suryaa Desk |

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 17270 నర్సాపూర్‌-విజయవాడ డెము రైలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రతి రోజూ నర్సాపూర్‌లో ఉదయం 9. 40కి బయలుదేరి మధ్యాహ్నం 1. 30 గంటలకు విజయవాడ చేరుతుంది. ఇదే రైలు నంబరు 17269 ఈ నెల 13న విజయవాడలో సాయంత్రం 4. 40 గంటలకు బయలుదేరి రాత్రి 8. 55కి నర్సాపూర్‌ చేరుతుంది. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్‌, భీమవరం టౌన్‌, ఉండి, ఆకివీడు, కైకలూరు, మండవల్లి, గుడివాడ, దోసపాడు, తరిగొప్పల, నిడమానూరు, రామవరప్పాడు, మధురానగర్‌ స్టేషన్లలో ఆగుతుంది.


రైలు నంబరు 07245 మచిలీపట్నం-గుడివాడ మెము రైలు ఈ నెల 13వ తేదీ నుంచి మచిలీపట్నంలో సాయంత్రం 6. 45 గంటలకు బయలుదేరి రాత్రి 7. 45కి గుడివాడ చేరుతుంది. నంబరు 07871 గుడివాడ-మచిలీపట్నం మెము రైలు 13వ తేదీ రాత్రి 8. 35 గంటలకు గుడివాడలో బయలుదేరి 9. 55కి మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలు పెడన, గుడ్లవల్లేరు స్టేషన్లలో ఆగుతుంది.


నంబరు 07869 మచిలీపట్నం-గుడివాడ మెము రైలు 14వ తేదీ నుంచి మచిలీపట్నంలో మధ్యాహ్నం 2. 25కి బయలుదేరి 3. 30కి గుడివాడ చేరుతుంది. నంబరు 07880 గుడివాడ-మచిలీపట్నం మెమూ రైలు 14వ తేదీ నుంచి గుడివాడలో సాయంత్రం 3. 45కి బయలుదేరి 5గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. చిలకలపూడి, పెడన, వడ్లమన్నాడు, కౌతరం, గుడ్లవల్లేరు స్టేషన్లలో ఆగుతుంది.

Latest News
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి Sat, Jan 29, 2022, 04:41 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పై ఎస్మా? Sat, Jan 29, 2022, 04:36 PM
రూ.6400 కోట్ల‌తో ర‌హదారుల నిర్మాణం Sat, Jan 29, 2022, 04:25 PM
భారీగా గంజాయి పట్టివేత Sat, Jan 29, 2022, 04:19 PM
స్టీల్ ప్లాంట్ సమ్మె వాయిదా Sat, Jan 29, 2022, 04:04 PM