శ్యామ్ సంగ్ ఏ8 ట్యాబ్...ధర రూ.18వేల లోపే

by సూర్య | Thu, Jan 13, 2022, 01:31 PM

ఎలక్ట్రానిక్ వస్తువుల తయారి లో పేరుగాంచిన శామ్ సంగ్ తాజాగా ఓ కొత్త ట్యాబ్ ను రూపొందించి మార్కెట్ లో  కి తీసుకొచ్చింది. శామ్ సంగ్ కంపెనీ గెలాక్సీ ట్యాబ్ ఏ8 ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కొత్త డిజైన్ తో, పెద్ద స్క్రీన్ తో, అధిక బ్యాటరీ సామర్థ్యంతో, చక్కని ఆడియో అనుభవాన్ని ఇది ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. శామ్ సంగ్ ట్యాబ్ ఏ8 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ రకం ధర రూ.17,999. ఇందులో సిమ్ ట్రే సదుపాయం ఉండదు. వైఫై ఎనేబుల్డ్. ఇందులోనే 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.19,999. ఇక ఎల్టీఈ సిమ్ ను సపోర్ట్ చేసే ట్యాబ్ ఏ8 3జీబీ, 32జీబీ స్టోరేజీ ధర రూ.21.999. ఇందులోనే 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.23,999. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేస్తే రూ.2,000 క్యాష్  బ్యాక్ ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది. బుక్ కవర్ ను రూ.999కే పొందొచ్చని పేర్కొంది. 10.5 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లే, స్లిమ్ బెజెల్స్ 16:10 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. డాల్బీ ఆటమ్స్ క్వాడ్ స్పీకర్ ఉంటుంది. 7,040 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో 8 మెగాపిక్సల్, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరాలు ఉంటాయి. ఇందులో యూనిసాక్ టైగర్ టీ618 ప్రాసెసర్ ఉంటుంది. స్క్రీన్ రికార్డర్ సదుపాయం కూడా ఉంది. ఏదైనా నచ్చిన కార్యక్రమాన్ని రికార్డు చేసుకోవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లకు ఇది అనుకూలం.

Latest News

 
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త Mon, May 23, 2022, 09:10 PM
మోసానికి, న‌మ్మ‌క ద్రోహానికి మూడేళ్లు: కొల్లు రవీంద్ర Mon, May 23, 2022, 08:13 PM
ఫ్యామిలీతో లండన్ టూర్ కు జగన్ ఎందుకు వెళ్లారో తేల్చండి: అయ్యన్న పాత్రుడు Mon, May 23, 2022, 08:11 PM
సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి: నారా లోకేష్ Mon, May 23, 2022, 08:11 PM
దోవోస్ టూ సజ్జల...ఆయన దర్శకత్వంలో ఇద్దంతా: బండారు సత్యనారాయణ Mon, May 23, 2022, 08:08 PM