పిల్లలలో కరోనా కొత్త లక్షణాలు..!

by సూర్య | Thu, Jan 13, 2022, 11:41 AM

కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో 23-30 శాతం మంది పిల్లలు ఒమిక్రాన్‌ బారిన పడుతున్నారు. భారత్ లో కూడా పిల్లల్లో కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్‌ తో పోలిస్తే ఒకటి రెండు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరు చిన్నారులకు కడుపు నొప్పి రావడంతో పాటు వాంతులు అవుతున్నాయి. జ్వరం, ఇతర సమస్యలు ఎక్కువగా కనిపించడం లేదు. చాలామంది తల్లిదండ్రులు కడుపునొప్పిని అజీర్ణ సమస్యగా భావిస్తున్నారు. పరీక్షలు చేస్తే కరోనా సోకినట్లు నిర్ధారణ అవుతోంది. డెల్టా వేరియంట్‌ లో పిల్లల్లో కడుపు నొప్పి కనిపించేది కాదని, అప్పట్లో వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలను గుర్తించామని వైద్యులు చెబుతున్నారు.


ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఐదుగురు చిన్నారులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పిల్లల్లో తలనొప్పి, 101-102 డిగ్రీల జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు ఉంటే కరోనాగా భావించి పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఐదేళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM