ఒమిక్రాన్‌ పై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

by సూర్య | Thu, Jan 13, 2022, 11:38 AM

ఒమిక్రాన్‌ ను తేలిగ్గా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. త్వరలోనే డెల్టాను అధిగమిస్తుందని వెల్లడించింది. ఇప్పటివరకు కనుగొన్న వాటిలో ఇదే అతి పెద్ద ఆధిపత్య వేరియంట్‌ అని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కొందరు దీన్ని జలుబులా భావించి తేలిగ్గా తీసుకుంటున్నారు. దీని తీవ్రత అంతగా ఉండదని ఊహించుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదం. ఈ వేరియంట్‌తో ఆసుపత్రులు పాలవుతున్న వారు కూడా అధికంగా ఉన్నారని తెలిపింది. ఇప్పటికే రోగాలున్న వారితో పాటు వృద్ధులు, టీకాలు తీసుకోనివారిపై ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉండనుందని డబ్ల్యూహెచ్‌వో సీనియర్‌ శాస్త్రవేత్త మరియా వాన్‌ కెరోవ్‌ తెలిపారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM