ఏ రోజు సంక్రాంతి జరుపుకోవాలి ?

by సూర్య | Thu, Jan 13, 2022, 11:21 AM

పైగా దానికి తోడు ప్రభుత్వం కూడా ముందుగా డిక్లేర్ చేసిన 14, 15, 16 తేదీలలో సెలవులను మార్పు చేస్తూ 13, 14, 15 తేదీలు గా మార్చడంతో ఇంకా ఎక్కువ సంశయం కలుగుతోంది.ఇక మీ సంశయాలకు స్వస్తి పలకండి.... ఈ క్రింది వివరణతో...14 వ తారీకు రా 08:14 కానీ రవి మకరం లోకి ప్రవేశించలేదు. మకర సంక్రాంతి నిర్ణయం వివిధ ఋషుల సిద్ధాంతాలు ఆధారితంగా చేస్తారు. ఏ ఋషుని ఫాలో అయ్యేవారు దానిని ప్రమాణంగా తీసుకుంటారు.న్యూటన్ లా ని బేస్ చేసుకుని ఇద్దరు స్టూడెంట్స్ రీసెర్చ్ చేసి ఒక కొత్త విషయాన్ని ఇద్దరు ఒకసారి కనిపెట్టారు అనుకుందాం, కానీ ఇద్దరూ.... రెండు రకాల మెథడ్స్‌ని ఫాలో అయ్యారు. ఇప్పుడు ఇద్దరివి సరైనవే..., ఒకరిది ఒప్పు ఒకరిది తప్పు అని అనలేం.అలాగే...,  కొంతమంది పంచాంగకర్తలు కూడా పైన తెలిపిన విధంగా వాళ్ళకి నచ్చిన వేదిక్ సైంటిస్ట్ ల (ఋషుల) వివరణలను తీసుకుని గ్రహగమనాన్ని లెక్కిస్తారు.సాధారణంగా సంక్రాంతికి మాత్రమే శాస్త్ర ప్రమాణం మనకు కనిపిస్తుంది తప్ప,  భోగి, కనుమ పండుగలకు సాంస్కృతిక ప్రమాణం తప్ప వేద ప్రమాణం అయితే ఎక్కడా కనిపించలేదు. 


 


 రవి సంక్రమణం అనగా , సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే సమయానికి సాధారణంగా 16 ఘడియల ముందు, వెనుక కాలాన్ని పుణ్యకాలంగా చెప్తారు, కానీ మకర సంక్రమణానికి 40 గడియల ముందు, 40 గడియల వెనుక పుణ్యకాలము అని, ఒకవేళ అ సంక్రమణం కనుక సూర్యాస్తమయం లేదా అర్ధరాత్రి కి దగ్గరగా ఏర్పడితే తర్వాత రోజు దినాన్నే పుణ్యకాలంగా తీసుకోవాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. 


 


ఘడియ అనగా 24 నిమిషాల కాలం.  ఇలా మకర సంక్రమణానికి సంబంధించి వివిధ ఋషుల ప్రపోజ్ చేసిన సిధ్ధాంతాలు సుమారుగా పదికి పైగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక సిధ్ధాంతం తీసుకుని ఇది సరైనదు అని వాదిస్తే,  అది తప్పు అని అని చెప్పడానికి మిగిలిన 9 సిద్ధాంతాలూ ఉన్నాయి. కానీ ఎవరి దృష్టిలో వారికి వాళ్ల సిధ్ధాంతం నే గొప్పగానే కనిపించవచ్చు.


 


కాబట్టి 14 రాత్రి 8:14 గంటలకు కానీ సంక్రాంతి ప్రవేశించలేదు, పైగా,  రాత్రి స్నానం శాస్త్రసమ్మతం మరియు ప్రమాణం కూడా కాదు. పైగా ఇది సూర్యమానానికి సంబంధించిన పండుగ. కాబట్టి ఏ సంశయం లేకుండా 14,15, 16 తేదీలలో హ్యాపీ గా పండగ సెలబ్రేట్ చేసుకోండి.*

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM