థర్డ్ వేవ్ అడ్డుకోవడానికి ఆ మూడే మార్గాలు

by సూర్య | Wed, Jan 12, 2022, 10:11 PM

కరోనా అడివి అడ్డుకోవాలంటే మూడు మార్గాలు మనముందు ఉన్నాయని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్ కే అరోడా పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి గణనీయంగా పెరగడానికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణం కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో థర్డ్‌వేవ్‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే మూడు అంశాలు ఎంతో ముఖ్యమని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్ కే అరోడా పేర్కొన్నారు. దేశంలో ఉద్ధృతి ఈ నెలలోనే గరిష్ఠానికి చేరుతుందని ఐఐటీ కాన్పుర్‌ నిపుణులు చేసిన అంచనాలు వాస్తవ రూపానికి దగ్గరగా ఉన్నాయన్నారు.‘‘ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించడం, అర్హులందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ చేయడం అనేవి రెండు ముఖ్యమైన అంశాలు. వీటికి తోడు పాలనాపరంగా తీసుకునే కర్ఫ్యూ వంటి చర్యలు కూడా వైరస్‌ వ్యాప్తి కట్టడికి దోహదపడుతాయి’’ అని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్ ఎన్‌.కే అరోడా స్పష్టం చేశారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM