నిరసనలో పాల్గొన్నందుకు... ఆ రోజు జీతం కట్
 

by Suryaa Desk |

తమ హక్కుల కోసం నిరసన వ్యక్తం చేసిన పాపానికి ఒకరోజు జీతాన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కోల్పోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊహించని  షాక్ ఇచ్చింది.  ఒక రోజు జీతం కట్ చేస్తూ ఎక్కడికక్కడ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలంటూ ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఉద్యోగుల ఆందోళనను తీవ్రంగా పరిగణించిన జగన్ సర్కారు ఒక రోజు జీతం కోతపెట్టింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 10,665 మంది సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. విధులకు హాజరు కాకుండా నిరసనలో పాల్గొన్నందుకు ఒక రోజు జీతంలో ప్రభుత్వం కోత పెట్టింది.  అలాగే, ప్రకాశం జిల్లాలో సైతం ఆందోళన చేసిన ఉద్యోగులకు గైర్హాజరైనట్లు హాజరుపట్టీలో నమోదు చేశాు. విధులకు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, శాంతియుతంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తే జీతభత్యాలు కోత విధించడం ఏంటంటూ సచివాలయ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM