ఓమిక్రాన్‌ నుంచి ఎవరూ తప్పించుకోలేరు

by సూర్య | Wed, Jan 12, 2022, 10:10 PM

ఓమిక్రాన్‌ను బారిన ప్రతి ఒక్కరూ పడక తప్పదు అని ని ఐసీఎంఆర్ నేషనల్ ఎపిడిమియాలజీ ఇన్‌స్టిట్యూట్ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ జయప్రకాశ్ మలియిల్ అన్నారు. అత్యంత వేగంగా వ్యాప్తిచెందే ఈ వేరియంట్‌ను బూస్టర్ డోస్‌లు కూడా అడ్డుకోలేవని ఆయన స్పష్టం చేశారు. ‘‘దీనికి వీళ్లు వాళ్లు అనే తేడా లేదు. అందరికీ ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే జరిగింది’’ అని డాక్టర్ జయప్రకాశ్ వ్యాఖ్యానించారు. ‘‘కొత్తరకం వేరియంట్ భయపెట్టేది కాదు ఎందుకంటే స్వల్ప లక్షణాలున్న ఒమిక్రాన్ వల్ల ఆసుపత్రిలో చేరే అవకాశం తక్కువగా ఉంటుంది.. ఇది మనం ఎదుర్కోగల వ్యాధి.. చాలా భిన్నమైన వైరస్‌తో వ్యవహరిస్తున్నాం.. ఇది డెల్టా కంటే చాలా తేలికపాటిది.. కానీ, మన అందరికీ తెలిసినట్లుగా ఆచరణాత్మకంగా దీనిని బారినపడకుండా అడ్డుకోలేం.. ఇది కేవలం జలుబు వంటింది ’’ అని వివరించారు. ‘అంతేకాదు, తాము వైరస్ బారినపడ్డామనే విషయం చాలా మందికి తెలియదు.. 80 శాతం మందికిపైగా ఇలాగే ఉంటుంది.. అధిక ముప్పు ఉన్నవారికే ప్రికాషనరీ డోస్‌ను సిఫార్సు చేశాం..గుండె జబ్బులు లేదా మధుమేహం ఉంటే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని కాదు’ అని చెప్పారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM