కనీసం 27శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి

by సూర్య | Wed, Jan 12, 2022, 10:05 PM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్ మెంట్ సరిపోదని ఆయన లేఖలో పేర్కొన్నారు. వారికి కనీసం 27 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 10 పీఆర్సీలలో ఇంటీరియం రిలీఫ్ కన్నా ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వలేదని తెలిపారు. పీఆర్సీపై ప్రభుత్వం చేసిన ప్రకటన అందరినీ నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. ఇక, 2021 అక్టోబర్ నాటికే గ్రామ సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లు పూర్తయిందని... వెంటనే వారికి ప్రొబేషన్ ఖరారు చేసి, పే స్కేల్ అమలు చేయాలని కోరారు.

Latest News

 
బెదిరింపులు తాళలేక.. తల్లీకుమార్తె బలవన్మరణం Sat, Sep 24, 2022, 11:46 PM
దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత Sat, Sep 24, 2022, 11:40 PM
ఏపీకి రేపు, ఎల్లుండి భారీ వర్షాలు Sat, Sep 24, 2022, 10:45 PM
ట్విట్టర్ లో బాలకృష్ణపై మంత్రులు సెటైర్లు Sat, Sep 24, 2022, 10:39 PM
తిరుమలకు వెళ్లే వాహనాలపై ఆంక్షలు Sat, Sep 24, 2022, 10:22 PM