![]() |
![]() |
by సూర్య | Wed, Jan 12, 2022, 10:04 PM
యావత్ ప్రపంచానికి కరోనా వైరస్ అంటించిన పాపం చైనాదేనని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అదే దేశంలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. చైనాలో మరో నగరంలోనూ వైరస్ కేసులు వెలుగు చూడడంతో స్థానిక ప్రభుత్వం అక్కడ కూడా లాక్డౌన్ విధించింది. అన్యాంగ్ నగరంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి దీంతో ఆ నగరంలో లాక్డౌన్ విధిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 55 లక్షల జనాభా ఉన్న ఆ నగరంలో ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో చైనాలో రెండు కోట్ల మంది ఇళ్లకు పరిమితం అయ్యారు.+
Latest News