దేశంలో ఫెడరల్ ఫ్రంట్ సాధ్యమేనా

by సూర్య | Wed, Jan 12, 2022, 10:08 PM

దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం, అధికార బిజెపి బలంగా ఉండటంతో ఈ రెండు పార్టీల వ్యతిరేక పార్టీలు  ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే  ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలతో మరోసారి ఫెడరల్ ఫ్రంట్ అంశం తెరపైకి వచ్చింది. గత నెలలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తోనూ నాలుగు రోజుల కిందట వామపక్ష నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అదే సందర్భంలో ఇటీవల బీహార్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం.. జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో అమలువుతున్న పథకాల గురించి ప్రధానంగా చర్చించారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఒక్కతాటికిపై తీసుకొచ్చే అంశం గురించి తేజస్వి యాదవ్ వివరించినట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం విధానాలు సహా పలు కీలక అంశాలపై ఇద్దరు చర్చించారు. విద్యుత్ సవరణ చట్టం, రైతు వ్యతిరేక విధానాలపై తేజస్వి యాదవ్.. సీఎం కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన తక్షణ అవసరం ఉందనే అభిప్రాయం ఇరువురూ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్‌తోనూ సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు అని సమాచారం. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడమే కాదు.. రాజకీయాల్లో క్రియాశీలకం కావాలని కోరినట్టు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, అనుభవం, ప్రజాదరణ కొత్త ఫ్రంట్‌‌కు అమూల్యమైనవని నొక్కి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో తెలంగాణ ఏర్పాటుకు ఆర్జేడీ మద్దతిచ్చిన విషయాన్ని లాలూ గుర్తు చేసినట్టు సమాచారం.


ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై లాలూ ప్రశంసలు గుప్పించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారని, అన్ని వర్గాలను సమానంగా చూస్తూ సాగుతున్న మీ పాలనానుభవం దేశానికి అవసరం ఉందని లాలూ అన్నట్టు పేర్కొన్నాయి. అలాగే, బీజేపీ ముక్త భారత్‌ కోసం లౌకిక, ప్రజాస్వామ్య కూటమిగా ఏర్పడి కలిసి పనిచేద్దామని లాలూ కోరినట్టు సమాచారం.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM