భూమిని ఆక్రమిస్తూ... వాటిని సమర్థించుకున్న చైనా

by సూర్య | Wed, Jan 12, 2022, 10:00 PM

చేసేది దురాక్రమణ అయినా వాటిని సమర్థించుకోవడం చైనా దేశానికే చెల్లింది. పొరుగు దేశాల భూభాగాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న చైనా.. తాజాగా, భూటాన్‌లో వివాదాస్పద ప్రాంతాల్లోకి చొరబడి నిర్మాణాలు చేపట్టినట్టు ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టాయి. మొత్తం ఆరు ప్రాంతాల్లో రెండంతస్తుల భవనాలతో పాటు 200పైగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని అమెరికాకు చెందిన డేటా ఎనలిటిక్స్ సంస్థ హక్‌ఐ 360 నుంచి వివరాలను రాయిటర్స్‌ సేకరించింది. క్షేత్రస్థాయి కార్యకలాపాలపై నిఘా వర్గాల నుంచి పక్కగా వచ్చిన సమాచారాన్ని నిపుణులు పరిశీలించి, విశ్లేషించినట్టు పేర్కొంది. భూటాన్ భూభాగంలో 2020 నుంచే చైనా నిర్మాణ సంబంధిత పనులు మొదలైనట్టు క్యాపెల్లా స్పేస్ ప్లానెట్ ల్యాబ్ ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయని హక్‌ఐ 360 మిషన్ అప్లికేషన్ డైరెక్టర్ క్రిస్ బిగ్గర్స్ తెలిపారు. 2021లో పనులు వేగవంతమైనట్టు ఉపగ్రహ చిత్రాలు తెలియజేస్తున్నాయని వివరించారు. 2020 ప్రారంభంలో శంకుస్థాపనలు చేసిందని తెలిపారు. ఈ ఆరు నిర్మాణ ప్రాంతాలు చైనా-భూటాన్ సరిహద్దుల్లోని వివాదాస్పద భూభాగంలో 110 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయని నిపుణులు విశ్లేషించారు. కాగా, ఈ అంశంపై భూటాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతు.. ‘‘తమ దేశ విధానాల ప్రకారం సరిహద్దు అంశాలపై బహిరంగంగా మాట్లాడకూడదు’’ అని ఆయన అన్నారు. ఇంతకంటే దీనిపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. మరోవైపు, ఈ నిర్మాణాలను చైనా సమర్ధించుకుంది. ‘‘పూర్తిగా స్థానిక ప్రజల పని, జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ నిర్మాణం చేపట్టాం.. తన స్వంత భూభాగంలో సాధారణ నిర్మాణ కార్యకలాపాలను నిర్వహించడం చైనా సార్వభౌమాధికారం పరిధిలోకి వస్తుంది’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్, భూటాన్, చైనా త్రికూడలి డోక్లామ్‌ వద్ద 2017లో ఇరు దేశాలు మూడు నెలల పాటు ఘర్షణ పడిన ప్రదేశానికి 9 నుంచి 27 కిలోమీటర్ల దూరంలోనే ఈ నిర్మాణాలు ఉన్నట్టు నిపుణులు పేర్కొన్నారు.

Latest News

 
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా..! కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిపై కూటమి నేతల గుర్రు. Tue, Apr 30, 2024, 10:46 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో. Tue, Apr 30, 2024, 09:18 PM
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా Tue, Apr 30, 2024, 09:16 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో Tue, Apr 30, 2024, 09:10 PM
మల్లెతోటలో బ్రాహ్మణి.. లోకేష్ కోసం ప్రచారం చేస్తూ Tue, Apr 30, 2024, 09:07 PM