నిఘా పెట్టిన పోలీసులపై కరోనా ఉగ్రరూపం

by సూర్య | Wed, Jan 12, 2022, 09:59 PM

కరోనా వ్యాప్తి చెందకుండా జన సమూహాలు కూడా కుండా చర్యలు తీసుకుంటున్న పోలీసులను ఆ వైరస్ టార్గెట్ చేసింది. జనవరి ఒకటో తేదీ నుంచి 12వ తేదీలోపు ఢిల్లీలో సుమారు 1700 మంది పోలీసులు వైరస్ బారిన పడినట్టు ఢిల్లీ పోలీస్ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 80 వేల పోలీస్ సిబ్బందిలో 1700 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. సోమవారం వరకు డిపార్ట్‌మెంట్‌లో వైరస్ సోకిన వారి సంఖ్య వెయ్యి ఉండగా రెండు రోజుల వ్యవధిలోనే మరో 700 మందికి కోవిడ్ వైరస్ సోకింది. దీంతో సమావేశాలు అన్నీ వర్చువల్గా నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వైరస్ సోకిన వారు హోం క్వారెంటైన్‌లో ఉన్నారని, వారందరికీ స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. తగ్గాక వారంతా విధుల్లో చేరుతారని అధికారులు వెల్లడించారు. అలాగే ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి అర్హులైన వారికి బూస్టర్ డోస్‌లు వేయించినట్టు తెలిపారు.

Latest News

 
ఈవీఎంలను ధ్వంసం చేసిన మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి.. వీడియో విడుదల చేసిన టీడీపీ Tue, May 21, 2024, 10:34 PM
మదనపల్లెలో పురుగుమందు తాగి ఓ మహిళ ఆత్మహత్య Tue, May 21, 2024, 09:35 PM
మదనపల్లెలో మహిళ అరెస్ట్ Tue, May 21, 2024, 09:33 PM
కోరం లేక సర్వసభ్య సమావేశం వాయిదా Tue, May 21, 2024, 09:30 PM
చీరాలపై ఎస్పీ జిందాల్ డేగ కన్ను Tue, May 21, 2024, 09:28 PM