పెరిగిన ఆందోళన వద్దు.. అంతే స్థాయిలో తగ్గుముఖం పడుతుంది

by సూర్య | Wed, Jan 12, 2022, 09:57 PM

ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగి నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాను రాను అంతే స్థాయిలో తగ్గుముఖం పడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచాన్ని ఒణికిస్తోన్న ఒమిక్రాన్ గురించి మంచి వార్త అందింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కేసులు అంతేస్థాయిలో తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ బయటపడ్డ దక్షిణాఫ్రికాలోనూ ఇలాగే జరిగిందని, నెలన్నర వ్యవధిలోనే కేసులు విపరీతంగా పెరిగి తర్వాత తగ్గిపోయాయని అన్నారు. అమెరికాలో రోజువారీ కేసులు ఎన్ని లక్షల్లో నమోదైనా అవి క్రమంగా పడిపోతాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ అలీ మోక్దాద్ చెప్పారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో సాధారణ లక్షణాలే కనిపించినప్పటికీ దేశాల్లో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ ఆ సంఖ్య తక్కువగానే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ కారణంగా 115 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో భారతదేశంలో ఒమిక్రాన్ సంబంధిత మరణం కూడా ఉంది. మొత్తం మీద 149 దేశాలు ఒమిక్రాన్ కేసులను నిర్ధారించాయని కేంద్రం పేర్కొంది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లతో పాటు ఆస్ట్రేలియాలోనూ ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశంలో ఎక్కువగానే క్రియాశీల కేసులు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక రష్యాలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఒమిక్రాన్తో రష్యా కరోనా కేసుల్లో ఉద్ధృతి పెరిగింది. అక్కడ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో దేశాల్లో కోవిడ్ కేసులు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. రాబోయే వారాల్లో ఈ పరిస్థితి ఎలా ఉండబోతుందనే దానిపై అనిశ్చితి నెలకొంది.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM