by సూర్య | Wed, Jan 12, 2022, 04:24 PM
గుంటూరు: పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో హెలికాప్టర్ దిగిన సీఎం కి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు నగరంలో ప్రవేట్ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో హెలికాప్టర్ దిగిన వెంటనే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్ పుష్పగుచ్ఛం అందజేసి సీఎం కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Latest News