విశాఖలో భారీగా ఉద్యోగాలు
 

by Suryaa Desk |

ది విశాఖ‌ప‌ట్నం కో ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీఎల్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. విశాఖ‌ప‌ట్నంలోని ఈ బ్యాంకులో ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.


* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 30 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భర్తీ చేయ‌నున్నారు.


పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అంతేకాకుండా కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు ఇంగ్లిష్, తెలుగు భాషలు మాట్లాడటం, చదవడం వచ్చి ఉండాలి.


* అభ్య‌ర్థుల వ‌య‌సు 31.12.2021 నాటికి 20 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.


ముఖ్య‌మైన విష‌యాలు..


* ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


* అభ్య‌ర్థుల‌ను ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


* ప‌రీక్ష‌ను మొత్తం 150 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఇంట‌ర్వ్యూకు 25 మార్కులు కేటాయిస్తారు.


* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు ప్రారంభంలో రూ. 35,000 చెల్లిస్తారు.


* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 11-01-2022న ప్రారంభం కాగా, 31-01-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM