కౌన్సిలర్ సభ్యులు తీరుపై అధికారులు అసహనం

by సూర్య | Wed, Jan 12, 2022, 01:30 PM

అనంతపురం: ప్రభుత్వ పథకాలకు సంబంధించి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు నిర్ణయించినాకానీ అధికార లపై తప్పుబట్టడం తగదని మునిసిపల్ అధికారులు అన్నారు. మునిసిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ ఇంద్రజ అధ్యక్షతన జరిగింది. గతనెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో తాత్కాలికంగా వాయిదాపడ్డ నాలుగు అంశాల అజెండాను కౌన్సిల్ తీర్మానించింది.


ఈ సందర్భంగా 33 వ వార్డు కౌన్సిలర్ శివ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని పెంచారు. దానిని ప్రజలకు తెలియజేసేందుకు ఈనెల 1 నుంచి వారంపాటు వైఎస్ఆర్ పించన్ వారోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. కానీ తూతూమంత్రంగా నిర్వహించారని ఇది అధికారులు తప్పిదమేనన్నారు. దీనిపై మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు మునిసిపల్ టెక్నికల్ అధికారి, మునిసిపల్ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు బండి ఆనందరాజు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు చేసే నిర్ణయాలపై కూడా అధికారులను తప్పుబట్టడం సరికాదన్నారు.


ఇక మీదట మునిసిపల్ అధికారులను ఎవరైనా ఆరోపించాలంటే మొదట చైర్ పర్సన్ కు నోటీసు ఇచ్చాక మాట్లాడాలన్నారు. కౌన్సిలర్ శివ మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార పార్టీ మాపై కేసులు పెట్టారని అయితే ప్రజా సమస్యలపై కౌన్సిల్లో మాట్లాడితే అధికారంలో ఉండి కూడా తమపై కేసులు పెట్టడం బాధాకరమన్నారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధ లు సమన్వయంగా పనిచేసి పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు బలరాం రెడ్డి, జబీవుల్లా, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM