కోడి పందెంలు నిర్వహిస్తే కఠిన చర్యలు

by సూర్య | Wed, Jan 12, 2022, 01:44 PM

అనంతపురం: అమడగూరు మండలంలో సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామాలలో ఎవరైనా కోడి పందెంలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లమాడ సిఐ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు కేసులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందెంలు పేకాట తదితర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


పండుగ సందర్భంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండి రాత్రి వేళలో గస్తీని మూమ్మురం చేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. మండలంలోని అన్ని చెక్ పోష్ట్ ఎస్ పి ఓ లు ద్వారా కర్ణాటక నుంచి మద్యం రవాణాను అరికట్టేందుకు పోలీసులు చెక్ పోష్ట్ ల్లో ప్రత్యేక నిఘా ఉంచి కర్ణాటక మద్యాన్ని అరికట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హైమావతి, ఏ ఎస్ ఐ కిషోర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, రమణ, రామ్మూర్తి, భాస్కర్ విజయ నాయుడు, చంద్రహాస్ , తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM