గుంటూరు జిల్లాలో గృహిణి అదృశ్యం

by సూర్య | Wed, Jan 12, 2022, 12:56 PM

గుంటూరు, తాడికొండ: మేడికొండూరులో గృహిణి అదృశ్యంపై మంగళవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై నరహరి తెలిపిన మేరకు.. మండలంలోని పాలడుగు గ్రామవాసి చల్లా రాజుతో పెదకూరపాడు మండలం బుస్సాపురం వాసి భవానీకి ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈనెల 7న తిరునాళ్లు కోసం భవాని పుట్టింటికి వెళ్లి వచ్చింది. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవ తలెత్తడంతో రాజు ఆమెపై చేయి చేసుకున్నారు. సోమవారం రాత్రి భవాని కనిపించకుండా పోయిందంటూ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Latest News

 
బెదిరింపులు తాళలేక.. తల్లీకుమార్తె బలవన్మరణం Sat, Sep 24, 2022, 11:46 PM
దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత Sat, Sep 24, 2022, 11:40 PM
ఏపీకి రేపు, ఎల్లుండి భారీ వర్షాలు Sat, Sep 24, 2022, 10:45 PM
ట్విట్టర్ లో బాలకృష్ణపై మంత్రులు సెటైర్లు Sat, Sep 24, 2022, 10:39 PM
తిరుమలకు వెళ్లే వాహనాలపై ఆంక్షలు Sat, Sep 24, 2022, 10:22 PM