కరోనా చికిత్సలో వీటిని వాడితే సంతానోత్పత్తి సమస్యలు: ఐసీఎంఆర్

by సూర్య | Wed, Jan 12, 2022, 12:30 PM

కరోనా చికిత్సలో మోల్నుపిరవిల్ ను వాడితే సంతానోత్పత్తి సమస్యలతో పాటు కండరాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కోవిడ్ -19 నేషనల్ టాస్క్ ఫోర్స్ అభిప్రాయం వ్యక్తం చేసింది. కొవిడ్ ప్రామాణిక చికిత్సలో ఈ యాంటీ వైరల్ డ్రగ్ తో పెద్దగా ప్రయోజనం లేదని తెలిపింది. ఈ ఔషధాన్ని అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగానికి వీలుగా డ్రగ్ రెగ్యులేటర్ జనరల్ గతేడాది డిసెంబర్ 28న అనుమతిచ్చింది. తాజాగా సోమవారం జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో దీని వాడకంపై సానుకూలత వ్యక్తం కాలేదు. దీని ఉపయోగంతో గర్భంలో పెరిగే పిండంలో లోపాలు తలెత్తుతాయని, శరీర కండరాలు కూడా బలహీనమవుతాయని విశ్లేషించారు. ఆడ, మగ రోగుల్లో ఎవరికి ఇచ్చినా వారు మూడు నెలల పాటు సంతానోత్పత్తి ప్రక్రియలో ఉండరాదని, లేకుంటే పుట్టే పిల్లల్లో తీవ్రమైన లోపాలు ఉండొచ్చని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం బార్గవ తెలిపారు.

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM