బాలికపై లైంగిక దాడి..!

by సూర్య | Wed, Jan 12, 2022, 12:28 PM

ఎంతో మంది విద్యార్థులకు న్యాయశాస్త్ర పుస్తకాలు రూపొందించిన ఆ వ్యక్తి బుద్ధి గాడి తప్పింది. న్యాయశాస్త్ర పుస్తకాలు రచించిన అతగాడు ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడి అరెస్ట్ అయ్యాడు. సుజాత పబ్లిషింగ్ హౌస్ ద్వారా విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను రూపొందించిన గాదే వీరారెడ్డి(72)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో పని చేసే మహిళ కూతురు(13) పై వీరారెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంగళవారం వీరారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి టూవీల్ వెహికిల్, మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. కాగా తనపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, దీనికి బాలిక తల్లి, ఆమె బంధువుల వేధింపులే కారణం అని లేఖ రాస్తానని వాట్సాప్ లో మెసేజులు పంపి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాజంలో మంచి వాడిగా గుర్తింపు తెచ్చుకుని ఆపై పాడు పని చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వీరారెడ్డిని పోలీసలు చర్లపల్లి జైలుకు తరలించారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM