మత్య్సకారులకు పండగే పండగ..!
 

by Suryaa Desk |

ఈ మధ్యకాలంలో మత్స్యకారుల పంట పండుతోంది. ఓ వైపు అధిక వర్షాలు కురవడంతో నదులు, కాలువలులో కూడా పలు రకాల చేపలు దొరుకుతున్నాయి. పైగా ఇవి భారీ రేటు పలుకుతుండడంతో జాలర్లకు కనక వర్షం కురుస్తోంది. సంక్రాంతికి ముందే వారికి పండగ వచ్చేసింది. ఊహించిన విధంగా ఆనందాలు నిపించింది. ఇది కదా నిజమైన పండుగ అనుకునేలా చేసింది.


గోదావరి జిల్లాల్లో ఇటీవల దొరికిన చేపలు లక్షలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఇలాంటి ఓ అరుదైన చేప లభించింది. సీహెచ్‌ కపాసుకుద్ధి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బైపల్లి తిరుపతిరావు సముద్రంలో వేటకు వెళ్లాడు. ఈయన విసిరిన వలకు ఏకంగా సుమారు 15 కిలోల కచ్చిలి చేప చిక్కింది. దీన్ని వేలం వేయగా వ్యాపారులు రూ.55 వేలకు కొనుగోలు చేశారు. దీంతో తిరుపతిరావు హర్షం వ్యక్తం చేశాడు.


చాలా అరుదుగా లభించే ఈ కచ్చిలి చేపలో ఎక్కువ ఆరోగ్య పోషకాలు ఉంటాయి అంటున్నారు మత్స్యకారులు. ఎందుకంటే ఈ చేపల పొట్టలో ఉండే తెల్లటి నెట్టును వివిధ రకాల ఔషధాల తయారీకి ఉపయోగిస్తారంటున్నారు. అందకే అంత భారీ ధర పెట్టిన ఈ కచ్చిలి చేపను కొన్నారు వ్యాపారులు. సాధరణంగా ఇవి ఎక్కువగా గోదావరి జిల్లాల్లో లభిస్తుంటాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో చిక్కడంతో వారి ఆనందానికి హద్దేలేకుండా పోతోంది.

Latest News
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి Sat, Jan 29, 2022, 04:41 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పై ఎస్మా? Sat, Jan 29, 2022, 04:36 PM
రూ.6400 కోట్ల‌తో ర‌హదారుల నిర్మాణం Sat, Jan 29, 2022, 04:25 PM
భారీగా గంజాయి పట్టివేత Sat, Jan 29, 2022, 04:19 PM
స్టీల్ ప్లాంట్ సమ్మె వాయిదా Sat, Jan 29, 2022, 04:04 PM