వైరల్ అవుతున్న ఇద్దరు యువకుల ప్రేమ కథ.. ఒకరికోసం మరొకరు ఆత్మహత్యాయత్నo
 

by Suryaa Desk |

నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కంది సాయికుమార్ దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. అతడికి టిక్ టాక్ ద్వారా మస్కట్‌లో పనిచేస్తున్న కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ సెల్‌ఫోన్‌లలో ప్రతిరోజూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. అలా ప్రేమలో పడిపోయారు. ఒకరోజు ఈ ఇద్దరు యువకులు తమ ప్రేమను ఒకరికొకరు ఎక్స్‌ప్రెస్ చేసుకున్నారు. దీంతో వారిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేకపోయారు. సృష్టికి విరుద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో సాయికుమార్ మస్కట్ వెళ్లిపోయాడు. అక్కడే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్దిరోజులుగా తన ప్రియుడు దూరమయ్యాడని సాయికుమార్ ఆవేదన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆ యువకుడి కోసం సాయికుమార్ మైదుకూరు వచ్చాడు. తన ప్రియుడి సంగతి పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని… మైదుకూరు పీఎస్ బయట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.అతడు లేకపోతే తాను బతకలేనని కరాఖండిగా చెప్తున్నాడు. దయచేసి తన ప్రియుడితో తనను కలపాలంటూ మైదుకూరు పీఎస్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు.

Latest News
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM