వైఎస్ వివేకా నంద‌రెడ్డి హ‌త్య కేసులో మరో ట్విస్ట్‌
 

by Suryaa Desk |

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్.. దివంగత నేత వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. మంత్రి వైఎస్ వివేకా నంద‌రెడ్డి హ‌త్య కేసులో అనుమానితుడిగా ఉన్న మరో నిందితుడిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైద‌రాబాద్‌ లో ఓ ప్రైవేట్‌ ఆసుప‌త్రి లో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డిని అదపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. దేవి రెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్‌ చేసిన అనంతరం… కోఠి లోని సీబీఐ కార్యాలయానికి త‌ర‌లించారు అధికారులు. ఇవాళ సాయంత్ర దేవి రెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి వైఎస్ వివేకా నంద‌రెడ్డి డ్రైవర్‌ దస్తగిరి లోంగిపోయాడు.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM