కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… ప్రజలు హైదరాబాదు ఇంటికి తరిమేశారు : వైసీపీ ఎమ్మెల్యే రోజా
 

by Suryaa Desk |

కుప్పంలోను వైసీపీ దూసుకుపోతుంది. కుప్పం ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ చంద్రబాబు దశాబ్దాలుగా కుప్పం నుంచి గెలుస్తున్నా ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని, కుప్పం ప్రజల సుఖ దుఃఖాల్లో టీడీపీ ఏనాడూ పాలుపంచుకోలేదని, చంద్రబాబు కుటుంబానికి కుప్పంలో కనీసం ఇల్లు కూడా లేకపోవడం అందుకొక నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం చేసిన కుప్పాన్ని జగన్ తన సొంత నియోజకవర్గంగా భావించి అభివృద్ధి చేస్తున్నారని, అన్ని అభివృద్ధి పనుల్లో కుప్పానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారని, అది గమనించిన ప్రజలు వైసిపి కి విజయం కట్టబెట్టారని అన్నారు. ఈ స్థానిక ఎన్నికల్లో నలబై ఏళ్ల ఇండ్రస్టీ అయినా చంద్రబాబుని ప్రజలు తరిమి కొట్టి..  కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… హైదరాబాదు ఇంటికి పరిమితం చేశారని వ్యాఖ్యానించారు… ఇకనైనా చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించిన రోజా.. కుప్పం ప్రజలు సీఎం వైఎస్‌ జగన్ వెంటనే ఉన్నారని స్పష్టం చేశారు. ఢిల్లీలో చక్రం తిప్పుతాననే చంద్రబాబు…. కుప్పం మున్సిపాలిటీలు బొక్క బోర్లా పడ్డారంటూ ఎద్దేవా చేసారు.… ఇక తండ్రి, కోడుకులు తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్‌కు పోండి అని వ్యాఖ్యానించారు.

Latest News
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM