రేపే భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్
 

by Suryaa Desk |

ఈ నెల 17న భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు సన్నాహాలు షురూ చేశారు. ఇక  కొత్త కోచ్, కొత్త కెప్టెన్ కలయికలో తొలి టీ20 సిరీస్ కు సిద్ధమైనది టీమిండియా. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ తో కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో కొత్త కోచ్ గా ద్రావిడ్ నియమితుడయ్యాడు. దానితో క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ రంగంలోకి దిగాడు.  ఈ నెల 17 నుంచి న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ జరగనుండగా, టీమిండియా ఆటగాళ్లతో ద్రావిడ్ సాధన చేయించాడు. నూతన కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. కొత్త కెప్టెన్, కొత్త కోచ్ కాంబినేషన్ లో టీమిండియా కొత్త ప్రస్థానం ప్రారంభిస్తోంది.  ద్రావిడ్ సమక్షంలో భారత క్రికెటర్లు ఎంతో ఉత్సాహంగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీసు చేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తుండగా, ద్రావిడ్ స్వయంగా త్రోడౌన్లు విసిరి సహకరించాడు.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM