తిరుమల శ్రీవారి కైంకర్యాలు సరిగా జరగడం లేదంటూ దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
 

by Suryaa Desk |

శ్రీవారి కైంకర్యాలపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని స్వామివారి భక్తుడు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. విచారణ సమయంలో సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ  పిటిషనర్ తీరు చూస్తుంటే ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది. ఆలయాలకు సంబంధించిన రోజువారీ కార్యక్రమాలను న్యాయస్థానాలు చేపట్టవన్న విషయం పిటిషనర్ గుర్తెరగాలని హితవు పలికింది. ఆలయాల్లో పూజలు, ఇతర కైంకర్యాల పర్యవేక్షణ ఆగమశాస్త్ర పండితులకు సంబంధించిన విషయం అని స్పష్టం చేసింది. అయితే, పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు టీటీడీకి సూచించింది. పూజా కైంకర్యాలపై సూచనలను టీటీడీకి చెప్పినా పట్టించుకోకపోతే సరైన ఫోరంను ఆశ్రయించాలని అటు పిటిషనర్ కు సూచించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై 8 వారాల్లో జవాబు ఇవ్వాలని టీటీడీని సుప్రీం కోర్టు ఆదేశించింది

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM