ఏపీ స్థానికసంస్థల కోటాలో వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

by సూర్య | Tue, Nov 16, 2021, 03:21 PM

ఆంధ్రప్రదేశ్ వరుసగా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఓ వైపు పరిషత్ పోలింగ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థులు సీఎం జగన్ ఇవాళ కలిశారు.
కడప జిల్లాకు చెందిన డీసీ గోవిందరెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన ఇషాక్ బాషా, శ్రీకాకుళం జిల్లాకుచెందిన పాలవలస విక్రాంత్‌లు.. నామినేషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఎన్నికల అధికారి. ఇవాళ్టి నుంచి నుంచి ఈనెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.ఈ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగనుంది. వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు పేర్లపై వైసీపీ హైకమాండ్‌ కసరత్తు పూర్తి చేసింది కూడా. జిల్లాల వారీగా పలువురి పేర్లను పరిశీలించి ఇప్పటికే వారికి పచ్చ జెండా ఊపింది. అనంతపురం జిల్లాలో ఒకే ఎమ్మెల్సీ స్థానం ఉండగా.. విశ్వేశ్వర్‌రెడ్డి, శివరామిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో రెండు స్థానాలకు నుంచి తలశిల రఘురాం, లంకా వెంకటేశ్వరావు.. ఆశావహుల జాబితాలో ఉన్నారు. తూర్పు గోదావరిలో అనంతబాబు ఒక్కరి పేరే వినిపిస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.
విజయనగరం నుంచి ఇందుకూరు రఘురాజు పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక- విశాఖలో రెండు స్థానాలకు వరుదు కల్యాణి, వంశీకృష్ణ యాదవ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. చిత్తూరు జల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుండగా.. భరత్‌ పేరు ఫైనల్‌ అయినట్లు సమాచారం.

వైసీపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే !
ఇందుకూరు రాజు (విజయనగరం)
వరుదు కళ్యాణి (విశాఖ)
వంశీ కృష్ణయాదవ్ (విశాఖ)
అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి)
మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా)
తలశిల రఘురామ్ (కృష్ణా)
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు)
మురుగుడు హనుమంతరావు (గుంటూరు)
తూమాటి మాధవరావు (ప్రకాశం)
కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు)
వై శివరామిరెడ్డి (అనంతపురం).. ఈ సారి ఇక ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లేని వ్యక్తులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు సీఎం జగన్‌..

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM