ఏపీ లో నేటి నుంచి ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు

by సూర్య | Tue, Nov 16, 2021, 03:13 PM

ఏపీ స్థానికసంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్.. విడుదల అయినది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఎన్నికల అధికారి. ఇవాళ్టి నుంచి నుంచి ఈనెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. నవంబర్ 26 నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ. ఇక, ఈ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగనుంది. అయితే ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం.. దాదాపు అన్ని స్థానాలు ఏక గ్రీవంగానే ముగిసే అవకాశం ఉంది.. ప్రస్తుతం గుంటూరు, కృష్ణ, విశాఖపట్నం జిల్లాల్లో చెరో రెండు, అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో ఒక్కో ఖాళీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. డిసెంబర్ 10న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ జారీ అయిన దృష్ట్యా ఇవాళ్టి నుంచి ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
అనంతపురం జిల్లా,  కృష్ణా జిల్లా,  తూర్పు గోదావరి,  గుంటూరు జిల్లా, విజయనగరం , విశాఖపట్నం, చిత్తూరు జల్లాలో ఎన్నికల అమలు లోకి వచ్చింది.

Latest News

 
పల్నాడు జిల్లాలో నేడు కూడా 144 సెక్షన్ Fri, May 17, 2024, 12:43 PM
ఎవరెస్ట్, ఎండీఎచ్ మసాలాలపై నేపాల్ నిషేధం Fri, May 17, 2024, 12:40 PM
108 వాహనంలో కవలలు జననం Fri, May 17, 2024, 12:32 PM
యువతి అదృశ్యంపై కేసు నమోదు Fri, May 17, 2024, 12:31 PM
మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాము Fri, May 17, 2024, 11:49 AM